calender_icon.png 16 May, 2025 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ

16-05-2025 12:17:12 AM

ఎమ్మెల్యే భూపతి రెడ్డికి

కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు 

నిజామాబాద్, మే 15 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా గురువారం రూరల్ నియోజ కవర్గం నిజామాబాద్ మండలంలోని మల్లా రం గ్రామంలో 40 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఇందిరమ్మ ఇండ్లకు కృషి చేసిన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి మల్లారం గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ డిసిసి డెలిగేట్ మెంబర్ జవాజీ రమేష్ గ్రామ సెక్రెటరీ శ్వేత కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పీట్ల నెహ్రూ మండల సెక్రెటరీ కొండా శ్రీనివాస్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు గస్కంటి లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు.