calender_icon.png 6 July, 2025 | 5:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోరిన భక్తులకు కొంగు బంగారమైన నిలిచే కనకదుర్గమ్మ తల్లి

06-07-2025 11:10:16 AM

వైభవంగా కనకదుర్గమ్మ జాతర

హుజూర్ నగర్: కోరిన భక్తులకు కొంగుబంగారమై నిలిచే తల్లి కనకదుర్గమ్మ అని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు రాధిక అన్నారు. పట్టణంలోని దీక్షిత్ నగర్ కాలనీలో ఆదివారం కనకదుర్గమ్మ జాతర అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. మహిళా భక్తుల పెద్ద సంఖ్యలో తరలివచ్చి కనకదుర్గమ్మకు బోనాలు, చీరే, సారెలు సమర్పించారు. భక్తుల వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గొర్రెలు, మేకలు, కోళ్లు భలిఇచ్చి భక్తులు తమ మొక్కలు చెల్లించారు. ప్రతి ఏటా ఆషాడంలో ఆదివారం కనకదుర్గమ్మ జాతర చేయడం ఆనవాయితీగా వస్తుందని భక్తులు పేర్కొన్నారు. అనంతరం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున రావు, రాధిక దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.