calender_icon.png 6 July, 2025 | 5:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రెజిల్ చేరుకున్న ప్రధాని మోదీ

06-07-2025 09:22:58 AM

బ్రెసిలియా: విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం బ్రెజిల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని రాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. శనివారం సాయంత్రం గలేయో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి సాదర స్వాగతం లభించింది. హోటల్ వద్ద ప్రధానికి ప్రవాస భారతీయులు సాంస్కృతిక ప్రదర్శనలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రవాస భారతీయులతో ప్రదాని మోదీ కాసేపు ముచ్చటించారు. 

భారతదేశం, అర్జెంటీనా శనివారం ద్వైపాక్షిక వాణిజ్యాన్ని వైవిధ్యపరచడానికి రక్షణ, కీలకమైన ఖనిజాలు, ఔషధ, ఇంధన, మైనింగ్ రంగాలలో సహకారాన్ని పెంచుకోవడానికి అంగీకరించాయి. రెండు సహజ భాగస్వాముల మధ్య సంబంధాలను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంపై మోదీ చెప్పారు. ఇవాళ బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వాతో మోదీ సమావేశం కానున్నారు. అనంతరం నేడు, రేపు బ్రెజిల్ రాజధాని రియోడీజెనీరీలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. బ్రెజిల్ వెళ్లే ముందు బ్రిక్స్ సదస్సుపై ఆయన ప్రకటన విడుదల చేశారు.

అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారానికి కట్టుబడి ఉన్నామని, శాంతియుత, ప్రజాస్వామ్య ప్రపంచం కోసం మరింత కృషి చేస్తామన్నారు. బ్రెజిల్ రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా బ్రిక్స్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇటీవల బ్రిక్స్ లో ఈజిప్టు, సౌదీ, ఇరాన్, యూఏఈ, ఇథియోపియా చేరయని మోదీ తెలిపారు.  ఐదు దేశాల పర్యటనలో భాగంగా మోదీ ఘనా, ట్రినిడాడ్ టొబాకో, అర్జెంటీనాలను సందర్శించారు. ఆయన తన పర్యటన చివరి దశలో నమీబియాకు వెళ్లనున్నట్లు సమాచారం.