06-07-2025 11:07:00 AM
అనంతగిరి: విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా అడిషనల్ పిడి శిరీష(Suryapet District Additional PD Sirisha) అన్నారు.శనివారం అనంతగిరి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం(Mandal Praja Parishad Office)లో 4వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం ఇన్చార్జి ఎంపీడీవో రామచంద్రరావు,ఇంచార్జ్ ఏపీవో వెంకన్న ఆధ్వర్యంలో నిర్వహించారు.మండలంలోని 20 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఉపాధి హామీ పనుల ఆడిట్ ను నిర్వహించారు. ఏప్రిల్ 1,2024 నుండి మార్చి 31,2025 ఆర్థిక సంవత్సరంలో రూ.4,24,87,289 కోట్లతో చేపట్టిన పనులు వాటి బిల్లుల వివరాలు తదితర అంశాలపై జరిగిన సామాజిక తనిఖీ పై క్రింది స్థాయి అధికారులను ఆరా తీశారు. గ్రామాల్లో చేపట్టిన సామాజిక తనిఖీల్లో ఏ గ్రామాల్లో ఎంత మేరకు తప్పదాలు చోటు చేసుకున్నది.
సామాజిక తనిఖీ బృందాలు అధికారులకు వివరించారు. రికవరీలు రూ.57,432,పెనాల్టీ రూ.11,000 మొత్తం రూ.68.432 మేర తప్పుదాలు చోటు చేసుకోగా నిర్దేశించిన సమయానికి వాటిని చెల్లించాలని ఉపాధి హామీ సిబ్బందిని అధికారులు ఆదేశించారు. రికార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని పేర్కొన్నారు. వన మహోత్సవంలో భాగంగా నాటిన మొక్కలు చనిపోయినట్లయితే వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటాలని క్రింది స్థాయి అధికారులను అడిషనల్ పిడి శిరీష ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ ఆశ,ఇన్చార్జి ఎంపీడీవో రామచంద్ర రావు,ఇంచార్జ్ ఏపీవో వెంకన్న,టిఏలు,కార్యదర్శులు,ఎస్ఆర్పీ,డిఆర్పీలు,సోషల్ ఆడిట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.