calender_icon.png 6 July, 2025 | 7:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం

06-07-2025 09:02:57 AM

హైదరాబాద్: శ్రీశైలం జలాశయానికి భారీ స్థాయిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేశుల నుంచి 1,7,208 క్యూసెక్కులు నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది.  శ్రీశైలం జలాశయం నీటి మట్టం గణనీయంగా పెరగడంతో పూర్తి నీటిమట్టం 885 అడుగులు ఉండగా, ప్రస్తుతం 878.4 అడుగులకు చేరుకుంది.  శ్రీశైలం పూర్తి నీటినిల్వ 215.8 టీఎంసీలు, ప్రస్తుతం 179.89 టీఎంసీలుగా ఉంది. దీంతో శ్రీశైలం కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగతుంది. విద్యుత్ కేంద్రాల ద్వారా 67,399 క్యూసెక్కులు సాగర్ కు అధికారులు విడుదల చేశారు. దీంతో గరిష్ట స్థాయికి చేరువలో ఉండటంతో గేట్లు ఎత్తే అవకాశం ఉంది.