16-05-2025 12:19:52 AM
నిజాంసాగర్, మే 15 (విజయక్రాంతి ): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు లో దూకి తల్లి కొడుకులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చోటు చేసుకుంది.నిజాంసాగర్ ఎస్త్స్ర శివకుమార్ తెలిపిన విరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం మునిగేపల్లి గ్రామానికి చెందిన దార ప్రమీల (30),ధార అక్షయ్( 8), తల్లి కొడుకులు నిజాంపేట్ బ్యాంకుకు వెళ్లి వస్తామని ఇంట్లో చెప్పి ఇంటికి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారని ఆయన తెలిపారు.
గురువారం ఉదయం మత్స్యకారులు నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో మృతదేహాలను గుర్తించి తమకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను బయటకు తీయించామన్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారి సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
గత 20 రోజుల క్రితం ప్రమీల భర్త ధార సాయిలు అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని, దాంతో తీవ్ర మనస్థాపాన్ని గురైన ప్రమీల జీవితం పై విరక్తి చెంది కొడుకుతో సహా నిజాంసాగర్ ప్రాజెక్టులో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. శివ పంచనామ నిమిత్తం మృతదేహాలను బాన్సువాడ ఏరియా ఆసుపత్రికీ తరలించినట్లు ఆయన తెలిపారు.