10 May, 2026 | 11:54 AM

Breaking News

తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •   నలుగురు నక్సలైట్లను అదుపులో తీసుకున్న పోలీసులు   •   మంత్రి పొంగులేటిని కలిసిన పువ్వాళ్ళ దుర్గాప్రసాద్   •   ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. మూడు నెలల్లోపే దరఖాస్తుల కొలిక్కి   •   ఖమ్మంలో ఫుడ్‌ పాయిజనింగ్‌ కలకలం   •  

అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం

30-06-2025 03:52 PM

నంది మేడారంలో ఇందిరమ్మ ఇండ్ల  పత్రాల పంపిణీ లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ధర్మారం,(విజయక్రాంతి): అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం ధర్మారం మండలంలోని నంది మేడారంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ   ఏసిడిపి నిధులు సరిపోని పక్షంలో నంది మేడారం గ్రామంలో అభివృద్ధి పనులకు కలెక్టరేట్ నిధుల నుంచి రూ. 3 కోట్ల కలెక్టర్ మంజూరు చేశారని, కోటి 30 లక్షల రూపాయలను నంది మేడారం గ్రామంలో అభివృద్ధి పనులకు కేటాయించామని, నంది మేడారం గ్రామంలో 261 విద్యుత్ పోల్స్ తరలింపు కోసం 26 లక్షల రూపాయలు మంజూరు చేసామని, 80 లక్షల విలువ గల అంతర్గత సిసి రోడ్లు వేసుకున్నామని, మేడారం నుంచి కట్కెనపల్లి, కోర్టు వరకు సీసీ రోడ్డు పనులు నెల రోజులలో మంజూరు చేస్తామన్నారు. 

నంది మేడారం గ్రామంలో అర్హులైన 80 మంది నిరుపేదలకు మొదటి విడత కింద ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని, ఇంకా ఎవరైనా అర్హులు ఉన్న తప్పనిసరిగా ఇండ్లు మంజూరు అవుతాయని, ఎవరు బాధపడాల్సిన అవసరం లేదని, స్థలం లేని నిరుపేదలకు ప్రభుత్వ ఇంటి స్థలం కేటాయించి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేసే ఆలోచన చేస్తున్నామని, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద మహిళా సంఘాల ద్వారా బస్సు కొనుగోలు చేసి ఆర్టీసీ కు అద్దె కు పెట్టడం జరిగిందని, దీనివల్ల ప్రతి నెల  46 వేల రూపాయల ఆదాయం లభిస్తుందని, పేదలకు రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా, 200 యూనిట్లు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, రుణమాఫీ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.