28 August, 2026 | 2:10 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

ముత్తారం కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుని మాతృమూర్తి మృతి

26-06-2026 11:59 AM

పరామర్శించి నివాళులర్పించిన మాజీ జడ్పీటీసీ సదానందం, కాంగ్రెస్ నాయకులు

ముత్తారం, జూన్ 26(విజయక్రాంతి): ముత్తారం గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షులు కోల విజయకుమార్ మాతృమూర్తి  శుక్రవారం ఉదయం అకాల మరణం చెందారు. ఆమె మరణవార్త తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం విజయకుమార్  నివాసానికి చేరుకుని, పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాతృవియోగంతో బాధపడుతున్న విజయకుమార్ ను వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ కఠిన సమయంలో పార్టీ కార్యకర్తలందరూ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ బుచ్చంరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నూనెటి కృష్ణ యాదవ్, కాంగ్రెస్ కార్యకర్తలు స్థానిక నాయకులు పాల్గొని సంతాపం తెలియజేశారు.