కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
14-03-2026 12:08 AM
బిచ్కుంద మార్చి 13 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండలానికి సంబందించిన లబ్దిదారులకు శుక్రవారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భారం కాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సీమ శెట్కార్, కౌన్సిలర్లు నౌషా నాయక్, దర్పల్ గంగాధర్, దర్పల్ కార్తికా సంతోష్ స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.




