28 June, 2026 | 2:11 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

డిచ్‌పల్లి టీజీఎస్పీ 7వ బెటాలియన్‌లో పర్యటించిన అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్

14-03-2026 12:10 AM

డిచ్ పల్లి, మార్చి 13 (విజయక్రాంతి): నిజామాబాద్ రూరల్ డిచ్పల్లిలోని తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీ ఎస్ పి) 7వ బెటాలియన్ను అదనపు డీజీపీ (బెటాలియన్స్) సంజయ్ కుమార్ జైన్, ఐపీఎస్ శుక్రవారం సందర్శించారు. కమాండెంట్ పి. సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బెటాలియన్లో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న గెస్ట్ హౌస్ మరియు సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన చేసి, ఇటీవల పునరుద్ధరించిన అడ్మినిస్ట్రేటివ్ భవనం మరియు ఆర్‌ఓ మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. అనంతరం బెటాలియన్ ఆవరణలో మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ వి. నరసింహస్వామి, ఆర్‌ఐలు శ్రీనివాస్, మారుతి, నవనీత్ కుమార్, త్రిముఖ్, చంద్రశేఖర్తో పాటు ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది, మినిస్టీరియల్ స్టాఫ్ పాల్గొన్నారు.