17 April, 2026 | 5:39 AM

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ

29-05-2025 02:45 AM

కృష్ణ మే 28. మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరై మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని రాష్ట్రంలోని పేద వర్గాలకు  కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు స్థానికులు తాసిల్దార్ పుష్పలత. ఎంపీడీవో జానయ్య. తదితర శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.