కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
అశ్వరావుపేట, జూన్ 26, (విజయక్రాంతి): అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రం లోని ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలలో భాగంగా కళ్యాణ లక్ష్మి‘ పథకం కింద 32 మంది లబ్ధిదారులకు రూ 32,03,712 చెక్కులను ఎమ్మెల్యే జారే అదినారాయణ అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే మాట్లాడుతూ పేద కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కళ్యాణలక్ష్మి పథకం ఎంతో ఉపయోగకరమని తెలిపారు.
అమ్మాయిల వివాహ సమయంలో కుటుంబాలపై పడే ఆర్థిక ఒత్తిడిని తగ్గించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం వల్ల వేలాది కుటుంబాలు లాభపడుతున్నాయని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లబ్దిదారులు ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలియజేశారు.






