కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
21-07-2026 12:00 AM
ఆత్మకూరు, జూలై 20: ఆత్మకూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం కల్యాణలక్ష్మి పథకం కింద ఎనిమిది మంది లబ్ధిదారులకు చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేశ్వర్, పట్టణ అధ్యక్షుడు ఈర్లదిన్నె శ్రీనివాసులు, మున్సిపల్ చైర్పర్సన్ నాగమణి, వైస్ చైర్మన్ నల్గొండ శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి తులసిరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, సర్పంచులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.






