నాణ్యమైన విద్యకు ఉపాధ్యాయుల శిక్షణ
వీపనగండ్ల జూలై 20 .మండల కేంద్రంలో ప్రాథమిక ఉపాధ్యాయులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సమగ్ర వృత్యాంతర శిక్షణ మొదటి రోజు నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మండల విద్యాధికారి నరసింహ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిక్షణలో ఉపాధ్యాయులు ప్రభావంతమైన తరగతి గది కార్యకలాపాల ద్వారా గుణాత్మక విద్యను ప్రతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అమలుపరచాలి.
ఇందులో భాగంగా సోమవారం రోజు తెలుగు సబ్జెక్టుకు శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఫ్లన్ (ఫౌండేషనల్ లైట్రేసీ నూమె్రేసీ) పునాది అక్షరాస్యత నీ ప్రతి పాఠశాలలో తప్పకుండా ఖచ్చితంగా అమలుపరిచి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు సాధించడంలో తెలుగు ఆంగ్లంలో చదవడం రాయడం మరియు గణితంలో చతుర్విధ ప్రక్రియలు చేయు విధంగా ప్రాథమిక పాఠశాలల విద్యార్థులను తయారు చేయాలని వారు అన్నారు. ఈ శిక్షణ నిర్వాహకులుగా స్వామి, సంతోష్ కుమార్, రంజిత్ కుమార్, సురేష్ రాఘవ వ్యవహరిస్తున్నారు. ఇట్టి శిక్షణ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు మరియు సిఆర్పి వెంకటేష్ తదితరు పాల్గొన్నారు.






