1 March, 2026 | 2:16 PM

లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

01-03-2026 12:05 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని మెల్లకుంట తండా గ్రామంలో శనివారం కల్యాణలక్ష్మి పథకం చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ రామావత్ బాల్యనాయక్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు రామావత్ వాసురం ఆధ్వర్యంలో   చెక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రామావత్ కవితకు మంజూరైన చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు కొర్ర వర్జా నాయక్,మాజీ సర్పంచ్ కొర్ర కేస్లీ-వాసురం నాయక్,వార్డ్ సభ్యులు,ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.