1 March, 2026 | 2:00 PM

శ్రీసాయి, కేరళ స్కూల్లో జాతీయ విజ్ఞాన దినోత్సవం

01-03-2026 12:03 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా గోపాలపేట్ గ్రామంలో ఉన్న శ్రీసాయి స్కూల్, కేరళ టాలెంట్ స్కూల్‌లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్‌ను స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ సందర్శించి వీక్షించడం జరిగింది. విద్యార్థులు రూపొందించిన సైన్స్ నమూనాలు, ప్రాజెక్టులను పరిశీలించి వారి సృజనాత్మక ఆలోచనలను అభినందించడం జరిగింది.

విద్యార్థులకు విజ్ఞాన శాస్త్రం ప్రాముఖ్యత, దైనందిన జీవితంలో శాస్త్రీయ ఆలోచన విధానం అవసరాన్ని వివరించడం జరిగింది. ఇలాంటి విద్యా కార్యక్రమాల్లో విద్యార్థులు చురుకుగా పాల్గొని శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించడం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీసాయి, కేరళ స్కూల్ల ప్రిన్సిపాల్లు రఫీ, నిర్మల జిమ్మీ, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.