ప్రజా పాలనతో దేశంలో ముందంజలో తెలంగాణ
02-05-2026 07:19 PM
నేనావత్ బాలు నాయక్
దేవరకొండ,(విజయ క్రాంతి): ప్రజా పాలనతో తెలంగాణ దేశంలో ముందంజలో ఉందని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సమావేశంలో మాట్లాడుతూ, దేవరకొండ నియోజకవర్గంలో 33,927 రేషన్ కార్డులు, 5,767 కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు.32,036 కుటుంబాలకు ఉచిత విద్యుత్, 3,095 ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం జరిగిందని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉందని పేర్కొన్నారు.రేషన్ కార్డు ఉన్న కుటుంబ పెద్ద మరణిస్తే 5 లక్షల ఇందిరమ్మ కుటుంబ భీమా జూన్ 2 నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు






