రఘునాథ బంజరలో కొత్తగా మట్టి రోడ్డు ఏర్పాటు
02-05-2026 07:21 PM
కల్లూరు,(విజయక్రాంతి): మండల పరిధిలోని రఘునాథ బంజర గ్రామ స్మశాన వాటిక నుండి పేరువంచ లింక్ రోడ్డుకు కలుపుతూ సుమారు రెండు కిలోమీటర్ల మేర జేసీబీ సహాయంతో కొత్తగా మట్టి రోడ్డు నిర్మించారు. గ్రామ సర్పంచ్ కుక్కా సుధారాణి రానా ఆధ్వర్యంలో ఈ రోడ్డు పనులు చేపట్టి,గ్రామ ప్రజల అవసరాలు అలాగే పంట పొలాలకు రాకపోకలకు అనుకూలంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ రోడ్డు ఏర్పాటు విషయమై ఎమ్మెల్యే మట్టా నాగమయి దయానంద్‌ను కోరగా, వెంటనే స్పందించి పనులు పూర్తి చేయించారని, ఇందుకు గ్రామ ప్రజల తరపున వారికి కృతజ్ఞతలు తెలిపారు.






