12-11-2025 07:42:14 PM
వనస్థలిపురం ఏరియా దవాఖానలో అందజేసిన గెజిటెడ్ ఉద్యోగులు..
ఎల్బీనగర్: రంగారెడ్డి జిల్లా గెజిటెడ్ అధికారులు దాతృత్వ సేవలో ముందున్నారని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్ రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘ సభ్యురాలు, టీజీవోస్ కేంద్ర సంఘం మహిళా విభాగం కోశాధికారి శాంతిశ్రీ, ఆమె స్నేహితులు కలిసి వనస్థలిపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసవించిన నిరుపేద తల్లులకు మొదటి దశలో 100 కిట్లను (60 వేల రూపాయల విలువైన వస్తువులు) పంపిణి చేశారు.
టీజీవోస్ రంగారెడ్డి జిల్లా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ కె.రామారావు, శ్రీనేష్ కుమార్ నోరి ఆధ్వర్యంలో కిట్లను బాలింతలకు అందజేశారు. ఈ సందర్భంగా ఏలూరి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ... ఉద్యోగులు సేవా కార్యక్రమాలు చేపట్టాలని, స్వచ్చంద సంస్థలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణ, డాక్టర్ నాగేందర్, డాక్టర్ వినయ్ కుమార్, డాక్టర్ అనురాగిణి, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నాయకులు సత్యనారాయణ, శ్యామ్, శాంతి శ్రీ, నూతనకంటి వెంకట్, శ్రీనివాస్, లక్ష్మణ స్వామి, సైదమ్మ, సఖి సెంటర్ ఇంచార్జి జ్యోత్స్న, మహమూద్ అలీ, డాక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.