16 April, 2026 | 2:00 AM

అంగన్వాడీ టీచర్లకు మొబైల్స్ పంపిణీ

16-04-2026 12:00 AM

చేర్యాల, ఏప్రిల్ 15: సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన 8వ పోషణ పక్వాడ హృదయస్పర్శి ని ఏప్రిల్ 9 నుంచి 23 వరకు ఈ జరిగే కార్యక్రమం ద్వారా బాల్య పోషణ,ప్రారంభ విద్యా సేవలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిగా జనగామ శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరైనారు.

ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లు స్కూల్ పిల్లలకు యూనిఫామ్లు పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల పోషణ,విద్యా సేవలను మరింత బలోపేతం చేయడానికి ఈ మొబైల్స్ ఉపయోగపడతాయని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో పిల్లలకు అన్నప్రాసన(ప్రథమ ఆహారం) అక్షరాభ్యాసం కార్యక్రమాలను ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా నిర్వహించారు.పిల్లల ఆరోగ్యం,విద్యా అభివృద్ధికి ప్రభుత్వం,స్థానిక సంస్థలు కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ మంచి కార్యక్రమం ద్వారా చేర్యాల పట్టణ కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలలు మరింత బలపడతాయని,చిన్నారుల భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో చేర్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ముస్త్యాల అరుణ బాలనర్సయ్య,వైస్ చైర్మన్ మెడిశెట్టి ఉమా శ్రీధర్,కౌన్సిలర్లు, అంగన్వాడీ టీచర్స్,పిల్లల తల్లులు  మహిళలు పాల్గొన్నారు.