11 August, 2026 | 2:04 PM

Breaking News

బెంగాల్ సర్ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు   •   ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •  

విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ

18-06-2025 12:33 AM

గవర్నర్ చేతుల మీదుగా అందజేత

హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం భారత్ సేవాశ్రమ సంఘం ఆధ్వర్యం లో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. 4 వేల లాంగ్ నోట్‌బుక్స్, 1,600 షార్ట్ నోట్‌బుక్స్‌ను అందజేశారు.

నిస్వార్థంగా సేవ చేస్తున్న ఆశ్రమ కార్యదర్శి మునీశ్వరానందజీ మహారాజ్, వెంకటేశ్వరానందజీ మహారాజ్‌లతోపాటు సంఘాన్ని గవర్నర్ అభినందించారు. నాణ్యమైన విద్య ను అందించడంలో,  విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషిని గవర్నర్ ప్రశంసించారు. ఇటీవల పదో తరగతి ఫలితాల్లో పాఠశాల అద్భుతమైన ప్రతి భను కనబరిచిందని, వచ్చే విద్యాసంవత్సరంలో వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.