7 May, 2026 | 3:14 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు

18-06-2025 12:32 AM

జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 17 (విజయక్రాంతి): సీజనల్ వ్యాధులు ప్రబలకుం డా ముందస్తు చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్, జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఏఎం అండ్ హెచ్‌వోలు, ఎంటమాలజీ అధికారులతో శానిటేషన్, దోమల నివారణ, ఆస్తిప న్ను వసూళ్లపై కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దోమల నివారణకు చేస్తున్న ఫాగింగ్‌పై అసిస్టెంట్ మెడికల్ అధికారి పూర్తి బాధ్యత ఉంటుందని ఆదేశించారు. ఫాగింగ్ సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల వరకు తప్పని సరిగా చేయాలని, ఏ ఎల్‌ఓ లు క్షేత్ర స్థాయిలో యాంటీ లార్వా కార్యక్రమం, ఉదయం, సాయంత్రం ఫాగింగ్ పనులు చేపట్టాలని సూచించారు.

శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ వార్డుల వారీగా జరుగుతు న్న నేపథ్యంలో చెత్తను సకాలంలో రాంకీ ఎస్‌ఎస్‌ఆర్ వాహనాలు ద్వారా తరలించాలన్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు ఆస్తి పన్ను వసూలు చేయాలన్నారు. ట్రేడ్ లైసెన్స్ లేని పక్షంలో టాక్స్ వసూలు చేయాలన్నారు.

కుక్కల బెడద నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. మటన్, చికెన్ షాపులనుఫుడ్‌సేఫ్టీ అధికారులతో కలిసి తనిఖీలు చేయాలని చీ ఫ్ వెటర్నరీ అధికారి ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్లు రఘు ప్రసాద్, పంకజ, జోనల్ కమిషనర్లు హేమంత్ కేశవ్ పాటిల్, అపూర్వ చౌహాన్, హేమంత్ సహదేవ్ రావు, రవి కిరణ్, వెంకన్న పాల్గొన్నారు.