అంగన్‌వాడీ కేంద్రంలో పోషకాహార వస్తువుల పంపిణీ
వాంకిడి, (విజయక్రాంతి):వాంకిడి మండలంలోని బంబార గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో గురువారం చిన్నారులకు, గర్భిణీలకు, బాలింత మహిళలకు ప్రభుత్వం అందజేస్తున్న పోషకాహార వస్తువులను గ్రామ సర్పంచ్ బెండారే కృష్ణాజీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఉక్కుమారవ్వ, మురుకులు, బియ్యం, గుడ్లు, పల్లి పట్టీలు వంటి తదితర వస్తువులను అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. చిన్నారులు ఆరోగ్యంగా ఎదగడానికి పోషకాహారం ఎంతో అవసరమని, ప్రభుత్వం అందిస్తున్న పోషకాహార పదార్థాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా అందుతున్న సేవలు గ్రామ ప్రజలకు ఎంతో ఉప యోగకరంగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జాడే సంతోష్, పంచాయతీ కార్యదర్శి దుర్గం ధర్మయ్య, అంగన్వాడి టీచర్లు సువర్ణ, సరిత, అంగన్వాడి ఆయా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






