ఓటు హక్కును కాపాడటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
నిజామాబాద్, ఆగస్టు 19 (విజయ క్రాంతి): ప్రతి ఒక్కరి ఓటు హక్కు పరిరక్షించడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ధ్యేయమని టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం నిజామాబాద్ లోఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై నిర్వహించిన కీలక సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా, మహిళా & శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ఆధ్వర్యంలో ఈ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎస్ ఐ ఆర్ ఫేస్ 2 ప్రక్రియ పురోగతి, క్షేత్రస్థాయి పరిస్థితులు, ఓటర్ల జాబితా పరిశీలన, బీఎల్‌ఏల పనితీరు, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణపై విస్తృతంగా సమీక్షించారు. ఈ సందర్భంగా టి పి సి సి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ప్రతి పౌరుడి ఓటు హక్కును రక్షించడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు.
ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలు గత రెండున్నర నెలలుగా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేస్తున్నారని అన్నారు, ప్రతి ఓటరు తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్య నాయకులు,ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మహమ్మద్ షబ్బీర్ అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్,
కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, నిజామాబాద్ అర్బన్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, డిసిసిఅధ్యక్షులు, కైలాస్ శ్రీనివాస్, కామారెడ్డి జిల్లా మాజీ ౄCC అధ్యక్షులు, నిజామాబాద్ మేయర్ ఉమారాణి , రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, యూత్ కాంగ్రెస్ నాయకులు విపుల్బాజ్ గౌడ్, సునీల్ కుమార్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు,అసెంబ్లీ కోఆర్డినేటర్లు, పార్లమెంట్ ఎస్ ఐ ఆర్ కోఆర్డినేటర్లు, పార్లమెంట్ ఇంచార్జ్లు, తదితరులు పాల్గొన్నారు.






