18 June, 2026 | 5:35 PM

Breaking News

ధైర్యంతో వైకల్యాన్ని జయించాలి   •   దళిత క్రైస్తవుల హక్కుల కాపాడాలి   •   మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎంఇఓకు వినతి పత్రం   •   ఖానాపూర్ గోదావరి తీరంలో శాశ్వత ఏర్పాట్లు   •   నూతన సీఐ ఎల్లయ్యకు కుమ్మరి శాలివాహన సంఘం ఘన సత్కారం   •   వృద్ధాశ్రమంలో అన్నదానం.. వృద్ధులకు పాలు, పండ్లు పంపిణీ   •   రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు స్టే   •   ఇంటర్మీడియట్ కామర్స్, అకౌంటెన్సీ తెలుగు అకాడమీ పుస్తకాల సహ-రచయితగా డాక్టర్ ఎం మల్లారెడ్డి   •   అనారోగ్యంతో బాధపడుతున్న జంజర్ల సునందకు అండగా నిలిచిన మంత్రి శ్రీధర్ బాబు   •   ఇంటర్ విద్యార్థులకు ఉచిత శిక్షణ, ఫార్మసీ డిగ్రీ చదివే సువర్ణావకాశం   •  

స్మశాన వాటిక, గుడి మాన్యం భూములు ఆక్రమిస్తున్న వ్యక్తిపై చర్యలకు డిమాండ్

18-06-2026 04:49 PM

తహసిల్దార్ ,మున్సిపల్ కమిషనర్లకు వినతి పత్రం ఇచ్చిన గ్రామస్తులు.

నేరేడుచర్ల, జూన్ 18(విజయ క్రాంతి ): సూర్యాపేట జిల్లా ,నేరేడుచర్ల మున్సిపాల్టీ పరిధిలోని రామాపురంలో స్మశాన వాటిక స్థలం, కనకదుర్గ గుడి దేవుని మన్యం భూములు అక్రమణ జరుగుతున్నాయని గ్రామస్తులు తహసిల్దార్ ఎస్.సైదులు, మున్సిపల్ కమిషనర్ సి హెచ్.నాగరాజు కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా  గ్రామస్తులు మాట్లాడుతూ స్మశాన వాటిక స్థలం కనకదుర్గమ్మ గుడి చెందిన దేవుని మన్యం  భూములు ఉన్నాయని, గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చింతమల్ల సైదులు, అక్రమంగా చెట్లను తొలగించి, భూమిని చదును చేసి ఆక్రమించుకున్నారని,అట్టి స్థలంలో ఎస్.సి. కార్పోరేషన్ నిధుల నుండి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టి, అసంపూర్తిగా నిర్మించి, అట్టి నిధులను దుర్వినియోగం చేశారని, ఇప్పుడు అట్టి కమ్యూనిటీ హాల్ ని కూడా నాదే చెప్పుచున్నారని గ్రామస్తులు తెలిపారు. స్మశాన వాటిక,కనకదుర్గమ్మ గుడి మాన్యం భూమి సరిహద్దులు,నిర్ణయించి దురాక్రమనకు  పాల్పడుతున్న వారి పై రెవెన్యూ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్  చందమల్ల జయబాబు, మాజీ సర్పంచ్ జంగిలి వెంకటేశ్వర్లు, గ్రామస్తులు పోకబత్తిన శేఖర్, కొదమగుండ్ల నాగరాజు,మెండే జానయ్య, పాపయ్య, గంట సతీష్ తదితరులు ఉన్నారు.