18 June, 2026 | 4:59 PM

Breaking News

ఇంటర్మీడియట్ కామర్స్, అకౌంటెన్సీ తెలుగు అకాడమీ పుస్తకాల సహ-రచయితగా డాక్టర్ ఎం మల్లారెడ్డి   •   అనారోగ్యంతో బాధపడుతున్న జంజర్ల సునందకు అండగా నిలిచిన మంత్రి శ్రీధర్ బాబు   •   ఇంటర్ విద్యార్థులకు ఉచిత శిక్షణ, ఫార్మసీ డిగ్రీ చదివే సువర్ణావకాశం   •   ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే ఇంటి పన్ను, నల్ల బిల్లు మాఫీ   •   ఏఎన్ఎంలకు సబ్ సెంటర్ల కోసం కౌన్సిలింగ్   •   స్మశాన వాటిక, గుడి మాన్యం భూములు ఆక్రమిస్తున్న వ్యక్తిపై చర్యలకు డిమాండ్   •   అంగన్‌వాడీ కేంద్రంలో పోషకాహార వస్తువుల పంపిణీ   •   గుడిసెల్లో నివసించే నిరుపేదలకే తొలి ప్రాధాన్యత – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు   •   తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థులకు 120 స్టీల్ వాటర్ బాటిల్ ల పంపిణీ...   •   నకిలీ విత్తనాలు అమ్మితే కేసులు నమోదు   •  

గుడిసెల్లో నివసించే నిరుపేదలకే తొలి ప్రాధాన్యత – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

18-06-2026 03:48 PM

నిజాంసాగర్ జూన్ 18,(విజయక్రాంతి): ఓరి గుడిసెల్లో నిర్వహించే వరకే ఇందిర మహిళలు తొలి ప్రాధాన్యత ఇస్తామని జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు  ఆయన గురువారం నాడు  జుక్కల్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, నిర్మాణ పనుల పురోగతిపై అదనపు కలెక్టర్ నిమ్మ వి. గిరి  సంబంధిత అధికారులతో కలిసి  సమీక్ష సమావేశం నిర్వహించారు.

 ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ, లబ్ధిదారులు తమ ఇల్లు నిర్మాణ దశకు అనుగుణంగా డేటా సక్రమంగా అప్‌డేట్ అయ్యిందో లేదో అధికారుల ద్వారా పరిశీలించుకోవాలని సూచించారు. నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి అయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అలాగే గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ గృహ పథకంలో తొలి ప్రాధాన్యత కల్పించాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.