calender_icon.png 22 July, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద యువతి వివాహానికి పుస్తె, మెట్టెలు అందజేత

30-11-2024 11:59:05 AM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని సోమ గూడెం గ్రామపంచాయతీ బిలో పని చేసే ఇప్పలక్ష్మీ కుమార్తె, బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో పనిచేసే శివ అనే యువకుని వివాహానికి ఆర్యవైశ్య సంఘం నాయకులు శనివారం మాజీ జెడ్పిటిసి కారుకూరి రామచందర్ ఆధ్వర్యంలో మెట్టెలు, పుస్తెలను అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పద్మావతి మెడికల్ స్టోర్ యజమాని పెద్ది రాజేందర్, వంశీకృష్ణ స్టీల్ గిఫ్ట్ ప్యాలెస్ యజమానులు కటకం సృజన్ లావణ్య, సాయి మనీ జ్యువెలర్స్ యజమాని కోడితెల బాల ప్రసాద్, అవంతిక, బెల్లంపల్లి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జైన శ్రీనివాస్, వాసవి క్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు రేణికుంట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.