calender_icon.png 21 July, 2025 | 5:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లను వినియోగంలోకి తేవాలి

30-11-2024 11:55:10 AM

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం మున్సిపల్  షాపింగ్ కాంప్లెక్స్ లను వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గత రెండేళ్లుగా నిరుపయోగంగా ఉన్నాయని, తక్షణమే వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన షాపింగ్ కాంప్లెక్స్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ల్లో వారం, పది రోజుల్లో మహిళా సంఘాలతో ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

షాపులను సుందరంగా తీర్చిదిద్ది వాటిని మహిళలకు అప్పగించి వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ను అందుబాటులోకి తేనునట్లు చెప్పారు. వివిధ రకాల టిఫిన్స్, స్నాక్స్, భోజనంతో పాటు  రుచికరమైన ఆహార పదార్థాలను మహిళా సంఘాలు తయారు చేసుకొని ఇక్కడే వ్యాపారాలు జరుపేలా చూస్తామన్నారు. ఈ షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా లభించేలా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. షాపింగ్ కాంప్లెక్స్ లకు చుట్టూ సోలార్ లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.విద్యాచందన, మున్సిపల్ కమిషనర్ శేషాంజనేయ స్వామి, కౌన్సిలర్ రుక్మాంధర్ బండారి, అధికారులు, స్థానికులు ఉన్నారు.