నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒకే వారంలో 230 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు
- రూ. 21,60,000 జరిమానా విధించిన సంబంధిత కోర్టులు
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి
నిజామాబాద్, మార్చి 15 (విజయ క్రాంతి): నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిల లోనీ సరిహద్దులలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలను గత తేది:9-3-2026 నుండి తేది: 14 శనివారం వరకు మొత్తం 230 కేసుల ను పోలీసులు నమోదు చేశారు. విరినందర్నీ సంబంధిత కోర్టులలో హాజరుపరచగా ఈ 230 మందికి కోర్టులు వీరికి రూ: 21,60,000/- జరిమానా విధిచి నట్లు నిజామాబాద్ సీపీ సాయి చైతన్య తెలిపారు.
ఇందులో 14 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష కోర్టులు విధించాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పి పి పి.సాయి చైతన్య, మాట్లాడుతూ. ప్రజలు మద్యం సేవించి వాహనాలుకూడదన్నారు. వాహనాదారులు వాహనానికిసంబంధించినటువంటి పత్రలు సక్రమముగా తమ మనం వెంటే ఉంచుకొని ట్రాఫిక్ సిబ్బంది అడిగినప్పుడు చూపించాలని అలాగే రోడ్లపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆయన వాహనదారులకు సూచించారు.




