21 March, 2026 | 1:46 AM

ముస్లిం సోదరులకు ‘రంజాన్ తోఫా’ పంపిణీ

21-03-2026 12:11 AM

రేవల్లి, మార్చ్ 20: నాగపూర్ గ్రామంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. వారు లబ్ధిదారులకు రంజాన్ తోఫా కిట్లను అందజేశారు.

రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న తోఫా కిట్లు ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. పండుగలు సామరస్యానికి ప్రతీకలని, సమాజంలో ఐక్యతను పెంపొందించేందుకు అందరూ కలిసిమెలిసి పండుగలను జరుపుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంజలమ్మ శ్రీశైలం, సుల్తాన్ ఆలీ, దొడ్డి కేశవులు, వేణుగోపాల్, సుభాహన్ తో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.