21 March, 2026 | 1:46 AM

పేదల సంక్షేమం, అభివృద్ధి కాంగ్రెస్ వల్లే సాధ్యం

21-03-2026 12:11 AM

గజ్వేల్, మార్చి 20: పేదల సంక్షేమం, అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి అన్నా రు. శుక్రవారం కొడకండ్ల గ్రామంలో రూ.10 లక్షల నిధులతో నిర్మిస్తున్న సిసి రోడ్డు, మురుగు కాల్వల నిర్మాణ పనులను  గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూం కుంట నర్సారెడ్డి కోడకండ్ల సర్పంచ్ ముండ్రాతి లక్ష్మీ, ఉప సర్పంచ్ జ్యోతి నర్సింలుతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొడుకళ్ళలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ ను గెలిపించి పార్టీకి అండగా నిలిచిన గ్రామస్తులకు ఎల్లవేళలా తమ సహకారం అందిస్తామన్నారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులు అందిస్తామని వెల్లడించారు. కార్యక్ర మంలో వార్డ్ సభ్యులు, మాజీ సర్పంచ్ మాదాడి మహేందర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి తుప్పతి అంజి యాదవ్, గ్రామస్తులు పాల్గొన్నారు.