23-11-2025 03:52:21 PM
మందమర్రి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. మండలంలోని పొన్నారం, చిర్రకుంట గ్రామ పంచాయతీల ఆవరణలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గందె రామ్ చందర్, మండల కాంగ్రెస్ నాయకులు మాసు సంతోష్ కుమార్, పెంచాల రాజలింగు, ఒడ్నాల కొమురయ్యలు మహిళలకు చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మహిళను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుందన్నారు.
దీనిలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు వ్యాపార అభివృద్ధి కోసం, ఆర్థికంగా ఎదిగేందుకు విరివిగా రుణాలు అందిస్తుందన్నారు. స్వయం సహాయక సంఘాల లో ఉన్న ప్రతి ఆడ పడుచుకు రాష్ట్ర ప్రభుత్వం సారే అందిస్తుందని మొదటి విడతలో ఇందిరమ్మ జయంతిని పురస్కరించుకొని గ్రామీణ ప్రాంత మహిళలకు, రెండవ విడతలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పట్టణ ప్రాంత మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి హరీష్, ఐకేపీ సిసి చారి, కాంగ్రెస్ గ్రామ నాయకులు బొజ్జ రాములు, గోసిక వినయ్ కుమార్, సీఏ తిరుమల విఓఎలు సుమలత, పద్మ, సంధ్య, ఈజిఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ ఈద లింగయ్య, గ్రామపెద్దలు సంకె శ్రీనివాస్, వాల రవీందర్ రావు, బత్తుల తిరుపతిలు పాల్గొన్నారు