15 July, 2026 | 5:25 PM

Breaking News

ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కోఆర్డినేటర్ ప్రసాద్ రెడ్డి

15-07-2026 05:24 PM

 చేగుంట,(విజయక్రాంతి): రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఎస్ఐఅర్ కార్యక్రమని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు చేగుంట మండలంలోని  పలు గ్రామాల్లో నిర్వహిస్తున్న  (స్పెషల్ ఇంటెన్షవ్ రెవిషన్ ) కార్యక్రమానికి దుబ్బాక నియోజవర్గ బిఎల్ఏ కోఆర్డినేటర్ సోలిపేట ప్రసాద్ రెడ్డి, చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ తో కలిసి చేగుంట మండలంలోని చేగుంట,వడియారం,ఉల్లి తిమ్మయిపల్లి, గొల్లపల్లి, జేత్రం తండా,అంతసాగర్ గ్రామంలో బిఎల్ఓ వద్దకు వెళ్లి వివరాలు స్వీకరించారు. 

ఈ కార్యక్రమం లో చేగుంట గ్రామ సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్,వడియారం సర్పంచ్ సాయికుమార్ గౌడ్, వివిధ గ్రామాల           బిఎల్ఓ లు, బిఎల్ఓ  లు గ్రామ కార్యదర్శి లు, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాసాయిపేట శ్రీనివాస్,జనరల్ సెక్రటరీ కోండి శ్రీనివాస్,ఎఎంసి డైరెక్టర్ మొజామిల్,దొంతి రెడ్డి బాల్ రెడ్డి,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్,తదితరులు పాల్గొన్నారు.