15 July, 2026 | 5:23 PM

లక్క పురుగుల బెడదతో విలవిలలాడుతున్న గ్రామాలు..!

15-07-2026 05:22 PM

రామారెడ్డి,(విజయక్రాంతి): గోదాముల్లో నిల్వ ఉంచిన ధాన్యానికి పట్టిన లక్క పురుగులు గ్రామాల్లో కలకలం రేపుతున్నాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని మోషంపూర్, ఉప్పల్‌వాయి, పోసానిపేట గ్రామాల్లో ఈ కీటకాలు ఇళ్లలోకి చేరి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తినే ఆహారం, తాగే నీటిలోకి చేరుతుండటంతో పాటు చిన్నారుల ఆరోగ్యానికి ముప్పుగా మారాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ మూడు గ్రామాల ప్రజలు గోదాముల ఎదుట ఆందోళనకు దిగారు.ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, లక్క పురుగుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.