భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా మొక్కలను సంరక్షించాలి
కామారెడ్డి,(విజయక్రాంతి): మాందాపూర్ గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అదేవిధంగా వన మహోత్సవ కార్యక్రమం సందర్భంగా సర్పంచ్ హరీష్ యాదవ్ మాట్లాడుతూ పచ్చదనం పెంపొందించడంతో పాటు, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా మొక్కలను సంరక్షించాలని గ్రామ ప్రజలకు సూచించి, ఈత మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు గ్రామ సర్పంచ్ ఆకుల హరీష్ యాదవ్ ఆధ్వర్యంలో మరియు ఉప సర్పంచ్ సంతోష్ రెడ్డి , పంచాయతీ సెక్రెటరీ గంగుబాయి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజు గౌడ్ GPO లక్ష్మణ్ బీజేపీ గ్రామ అధ్యక్షులు శీలం శేఖర్ రెడ్డి వార్డు సభ్యులు వెంకటేశ్ యాదవ్, లింగారెడ్డి, నరసింహులు, శ్రీకాంత్ రెడ్డి, రోడ్డ లావణ్య బాబు కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ రాజు శ్యామలాల్ తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.






