18 August, 2026 | 4:55 AM

కస్తూర్భా పాఠశాలలో యూనిఫామ్, దుప్పట్లు పంపిణీ

18-08-2026 02:22 AM
  1. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతని ఇస్తుంది
  2. తహసీల్దార్ ఉమారాణి సర్పంచ్ వాసం సుష్మిత శ్రీకాంత్ 

ఆళ్ళపల్లి, ఆగస్టు 17, (విజయక్రాంతి) : మండల కేంద్రంలోని  కస్తూర్బా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలలో ప్రభుత్వం అందించిన ఏకరూప దుస్తులు, షూస్ షూస్ దుప్పట్లు,ఇతర సామగ్రిని స్థానిక తహసీల్దార్ ఉమారాణి సర్పంచ్ వాసం సుష్మిత శ్రీకాంత్ సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  విద్యార్థినులను ఉద్దేశించి తాసిల్దార్ ఉమారాణి సర్పంచ్ సుస్మిత మాట్లాడుతూ. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని  తెలిపారు.

ప్రభుత్వం విద్యార్థుల చదువుతో పాటు వారి అవసరాలను  పూర్తిగా తీరుస్తోందని బాలికలు బాగా చదివి, ఉన్నత స్థాయికి చేరుకోవాలి అని సూచించారు. గ్రామీణ ప్రాంత బాలికల విద్య కోసం ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని,పిలుపు నిచ్చారు. . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వాసం శ్రీకాంత్ మహిళా నాయకురాలు పానుగంటి మంగ గ్రామ శాఖ అధ్యక్షులు ప్రశాంత్ గ్రామ కార్యదర్శి సాయిరాజ్ ప్రిన్సిపాల్ సరోజిని ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.