18 August, 2026 | 4:08 AM

ప్రముఖ పర్యాటక కేంద్రంగా మెదక్ ఖిల్లా

18-08-2026 02:21 AM
  1. గనుల, భూగర్భ, ఉపాధి కార్మిక, పారిశ్రామిక శాఖల, ఇంచార్జి మంత్రి వివేక్ వెంకట స్వామి 
  2. మెదక్ పై ప్రత్యేక పోస్టల్ కవర్, స్టాంప్ ఆవిష్కరణ

మెదక్, ఆగస్టు 17(విజయ క్రాంతి) : మెదక్ పట్టణంలోని చారిత్రక మెదక్ ఖిదక్ పై ప్రత్యేక పోస్టల్ కవర్, స్టాంప్ను రాష్ట్ర పర్యాటక, బొగ్గు గనుల శాఖ మంత్రి, మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ...మెదక్ ఖిదక్ ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉందన్నారు. పురాతన కాలంలో నిర్మించిన మెదక్ ఖిదక్ పేరుతో ప్రత్యేక పోస్టల్ కవర్, స్టాంప్ విడుదల చేయడం అభినందనీయమని, ఇందుకు పోస్టల్ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మెదక్ ఖిదక్ ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి కృషి చేస్తాయని మంత్రి పేర్కొన్నారు.

స్వదేశీ దర్శన్ ప్రాజెక్ట్ కింద అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేంద్ర పర్యాటక శాఖ నుంచి నిధులు తీసుకువచ్చేందుకు ఎంపీ రఘునందన్ రావు కృషి చేయాలని సూచించారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా మెదక్ జిల్లా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని మంత్రి విమర్శించారు. మెదక్ను పర్యాటక రంగంలో మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తామని చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెదక్ చర్చి అభివృద్ధికి రూ.30 కోట్ల నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. మెదక్ జిల్లాలోని చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాలను అభివృద్ధి చేసి పర్యాటక రంగంలో జిల్లాకు మరింత గుర్తింపు తీసుకువస్తామని స్పష్టం చేశారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ మెదక్ ప్రాచుర్యాన్ని గుర్తించి భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో పోస్టల్ స్టాంప్ కవర్ ప్రారంభోత్సవం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

స్టాంపు ఆవిష్కరణ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలిపారు. పురాతన కట్టడం గా పేరెందిన ఈ కోట ప్రాచుర్యాన్ని గుర్తించి స్వదేశీ దర్శన్ కార్యక్రమంలో భాగంగా ప్రాచీన కాలంలో కట్టిన కోటలు పరిరక్షణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం శుభ పరిణామంగా పేర్కొన్నారు. గతంలో కాకతీయ రాజుల కాలంలో మన మెతుకు సీమ అనే వచ్చిందన్నారు.  మంజీరా పరివాహక ప్రాంతంలో పండిన వరి గింజలతో కాకతీయ రాజులకు అన్నం పెట్టేదని ఈ జిల్లాకు మెతుకు సీమ అని పిలవబడిందన్నారు.

అనేక రాజకీయ కారణాలవల్ల ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యాల వల్ల పూర్తిగా మెదక్ జిల్లా అని నిర్లక్ష్యానికి గురైందన్నారు, ఒక దశలో నిరాహార దీక్షలో కొట్లాడి మెతుకు సీమ జిల్లా కావాలనే దుస్థితి ఈ జిల్లా ప్రజలు నెట్ట  వేయబడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తూ చివరగా  మెదక్ జిల్లా సాధించుకోవడం  జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, మెదక్ ఆర్డీవో రమదేవి, డి ఎస్ పి ప్రసన్న కుమార్ ,పోస్టల్ శాఖ అధికారులు,మెదక్ మున్సిపల్ చైర్ పర్సన్ రాధిక భూపతి రాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్,మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.