13 August, 2026 | 3:49 PM

అంగన్‌వాడీ చిన్నారులకు యూనిఫామ్స్ పంపిణీ

13-08-2026 02:24 PM

భిక్కనూర్, ఆగస్టు 13(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం కాచాపూర్ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు యూనిఫామ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పాలమాకుల జ్యోతి సంతోష్ గౌడ్, ఉపసర్పంచ్ బైండ్ల దశరథం చిన్నారులకు యూనిఫామ్స్ అందజేశారు. అంగన్‌వాడీ టీచర్ బాసం కవిత కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు.