13 August, 2026 | 3:53 PM

వెల్దండ మండలంలో వివాహిత దారుణ హత్య

13-08-2026 02:25 PM

వెల్దండ, ఆగస్టు 13: నాగర్‌ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన నారుమళ్ల అనూష (22) దారుణ హత్యకు గురైంది. పోలీసుల కథనం ప్రకారం.. కల్వకుర్తిలోని ఓ లేడీస్‌ కార్నర్‌లో పనిచేస్తున్న అనూషకు భర్త చిన్నయ్య, ఓ కుమారుడు ఉన్నారు. అయితే గ్రామానికి చెందిన రాములుతో ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. బుధవారం రాత్రి అనూషను రాములు మరో వ్యక్తితో కలిసి ఒడ్డోని రాళ్ల ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసిన అనంతరం కట్టెలతో నిప్పంటించి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలిలో మృతదేహానికి సంబంధించిన అవశేషాలు మాత్రమే లభ్యమైనట్లు తెలిసింది. ఈ ఘటనలో అనూషతో సంబంధం ఉన్న రాములుతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.