5 May, 2026 | 7:43 PM

ఓటర్ స్లిప్‌ల పంపిణీ షురూ

27-04-2024 01:27 AM

l బీఎల్‌ఓల ద్వారా మే 3 వరకు పంపిణీ

హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఎల్‌వోలు శుక్రవారం ఓటరు స్లిప్‌ల పంపిణీని ప్రారంభించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలలో మొత్తం 45,70,138 మంది ఓటర్లు ఉండగా, అధికారులు 1,675 ప్రాంతాల్లో 3,986 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధ్దంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం అడిషనల్ కమిషనర్ మంగతాయారు తెలిపారు. మే 3వ తేదీ నాటికి ఓటరు స్లిప్‌లను పంపిణీ పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్ అందజేస్తామన్నారు.