మహిళలకు వాషింగ్ మిషన్ల పంపిణీ
25-08-2026 10:31 PM
నిర్మల్,(విజయక్రాంతి): ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం లో మహిళలకు వాషింగ్ మిషన్లను పంపిణీ చేశారు. దిలావర్‌పూర్ మండలంలోని 8 గ్రామాలకు చెందిన 65 మంది రజక కుల లబ్ధిదారులకు ఉచిత వాషింగ్ మిషన్లను పీఎం విశ్వకర్మ యోజన ఇంప్లిమెంటేషన్ జిల్లా కమిటీ సభ్యుడు సామ రాజేశ్వర్‌రెడ్డి మంగళవారం అందజేశారు. పేద కుటుంబాలకు చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.






