రైతులతో సీఎం రేవంత్ ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్
చివ్వేంల: సోమవారం రైతులతో సీఎం రేవంత్(CM Revanth Reddy) ముఖాముఖి కార్యక్రమానికి చివ్వెంల మండలం గాయంవారి గుడెం గ్రామం రైతు వేదిక నుంచి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్(District Collector Tejas Nandlal Pawar), నరసింహ, ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. వీడియో సమావేశం అనంతరం రైతు వేదికలో హాజరైన రైతులతో జిల్లా కలెక్టర్ తేజస్ మాట్లాడుతూ... రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు.
సీఎం సూచనల మేరకు ప్రభుత్వం అందించే రైతు భరోసా పెట్టుబడి డబ్బులతో రైతులు అన్ని రకాల పంటలు సాగు చేయాలని అన్నారు. ఆదర్శ రైతులచే రైతు వేదికలలో వారి అనుభవాలు పంచుకునే విధంగా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ k. వేణా రెడ్డి, మండల ప్రత్యేక అధికారి జగదీశ్ రెడ్డి, తాసిల్దార్ ప్రకాష్, జిల్లా వ్యవసాయ అధికారి జి.శ్రీధర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, ఏ ఈ ఓ శైలజ, అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు




