20 March, 2026 | 9:14 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

వరి ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్ష

28-10-2024 08:08 PM

నారాయణపేట,(విజయక్రాంతి): రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం విక్రయించుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ విసి హాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు సివిల్ సప్లై మార్కెటింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఐకెపి 30, పీఏసీఎస్ 67, మెప్మా 2, రైతులు 2 కేంద్రాలు ప్రారంభించాలన్నారు. వరి ధాన్యం కేంద్రాలు ప్రారంభించని పక్షంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

ప్రభుత్వం సన్న రకం వడ్లకు రూ 500 బోనస్ గా చెల్లిస్తుందన్నారు. సన్న రకం,  దొడ్డు రకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే 20 లక్షల గన్ని బ్యాగుల సిద్ధంగా ఉన్నాయని ప్రతి కొనుగోలు కేంద్రానికి గన్ని బ్యాగులు సరఫరా చేయాలని ఆదేశించారు. గన్ని బ్యాగులపై కోడ్ నంబర్ రాయాలని తెలిపారు. అనంత్రం కలెక్టర్ ని ఎస్. పి. సన్మానం చేసిన చైర్మన్.ఈ సమావేశంలో ఎస్. పి. యోగేష్ గౌతమ్,మార్కెట్ చైర్మన్ ఆర్.శివారెడ్డి, వైస్ చైర్మన్ హనుమంతు, మార్కెట్ అధికారులు, డైరెక్టర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు.