calender_icon.png 29 August, 2025 | 8:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఘట్ కేసర్ మున్సిపల్ కమీషనర్ గా బి.చంద్రశేఖర్

28-10-2024 06:31:34 PM

ఘట్ కేసర్ (విజయక్రాంతి): ఘట్ కేసర్ మున్సిపల్ కమీషనర్ గా బి.చంద్రశేఖర్ సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మున్సిపల్ కమీషనర్ గా విధులు నిర్వహించిన ఎండీ సాబేర్ అలీ నిజాంపేట్ కార్పోరేషన్ కమీషనర్ గా బదిలీ కావటంతో ఆయన స్థానంలో మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ కమీషనర్ బి చంద్రశేఖర్ బాధ్యతలు తీసుకున్నారు. నూతన కమీషనర్ గా బాధ్యతలు తీసుకున్న చంద్రశేఖర్ ను మున్సిపల్ చైర్ పర్సన్ పావని జంగయ్య యాదవ్, వైస్ చైర్మన్ మాధవరెడ్డి లు శాలువాలు, పూల మాలలతో ఘనంగా సన్మానించారు. అవినీతి రహిత సంపూర్ణ అభివృద్దే లక్ష్యంగా నిరంతరం పని చేస్తానని ఈ సందర్భంగా కమీషనర్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రతి ఒక్కరు అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ద చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వెంకట్ రెడ్డి, రమాడేవి మహిపాల్ గౌడ్, బండారి అంజనేయులు, జహంగీర్, నర్సింగ్ రావు, సహకార సంఘం మాజీ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ గోపాల్ రెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.