పండుగ సాయన్న విగ్రహ ప్రతిష్ఠకు భూమిపూజ
08-08-2026 09:16 PM
గండీడ్: మండల కేంద్రంలో పండుగ సాయన్న జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండ్రు. ఈ సందర్బంగా పండుగ సాయన్న విగ్రహ ప్రతిష్ఠాపన కోసం శనివారం భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమంలో గండీడ్ గ్రామ సర్పంచ్, రగెరి భగవంత్ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్, రగెరి శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ గుమ్మడాల చెన్నయ్యలు పాల్గొని భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ పండుగ సాయన్న గొప్పతనం, చేసిన సేవలను ప్రజలకు తెలియజేసేలా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ముదిరాజ్ సంఘం సభ్యులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.






