16-05-2025 12:00:00 AM
ఎల్బీనగర్, మే 15 : హయత్ నగర్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యాసంవత్సరానికి డిగ్రీ అడ్మిషన్స్ కోసం జిల్లా సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. అడ్మిషన్లు పొందటంలో విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలను రంగారెడ్డి జిల్లా దోస్త్ సహాయ కేంద్రాన్ని సందర్శించి పరిష్కరించుకోవాలని గురువారం ఒక ప్రకటనలో కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సురేశ్ బాబు తెలిపారు.
దోస్త్ సహాయ కేంద్రం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ప్రతి రోజూ పని చేస్తుందని తెలిపారు. వివరాలకు దోస్త్ సహాయ కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ నర్సింహ (9948985954), టెక్నికల్ అసిస్టెంట్ కె.వినయ్ కుమార్ (9666 338001) ను సంప్రదించాలని ఆయన సూచించారు.