16-05-2025 12:00:00 AM
కల్లూరు, మే 15 ః దేశ చరిత్రలో లో ఎక్కడ లేని విదంగా హైదరాబాద్ నుండి దేవరపల్లి గ్రీన్ ఫీల్ హైవే రోడ్ పై మూడు ఎగ్జిట్ రోడ్ లు అందిన ఘనత ఒక్క సత్తుపల్లి నియోజకవర్గానికి దక్కుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం సత్తుపల్లి ని యోజకవర్గం వేంసూరు మండలం లింగపాలెం హైవే రోడ్ ఎగ్జిట్ నుండి కల్లూరు మండలం లింగాల హైవే రోడ్ ఎగ్జిట్ వరకు పనులను ఆయన పరిశీలించారు.
అనంతరం ఏర్పాటు చేసిన వేదిక పైనుంచి ఆయన మాట్లాడుతూదేశ చరిత్రలో నే ఒక నియోజకవర్గం లో హైవే రోడ్ పై మూడు ఎగ్జిట్ రోడ్ లో ఇవ్వటం ఇదే ప్రధమం అని ఆ ఘనత మీ సత్తుపల్లి నియోజకవర్గం ఎ మ్మెల్యే రాగమయి కి, సత్తుపల్లి నియోజకవర్గం ప్రజలకు దక్కుతుందన్నారు. రైతుల కోసం అన్ని ప్రాంతాల్లో ఎగ్జిట్ పోల్ లు ఇవ్వాలి అని అధికారులను ఆదేశించారు.
జులై 2 నాటికి అసంపూర్తిగా ఉన్న వంతెనలను పూర్తి చెయ్యలని , వచ్చే ఆగస్టు 15 నాటికీ రోడ్డును వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ..సత్తుపల్లి నియోజకవర్గం లో హైవే పై 3 ఎగ్జిట్ లు ఇచ్చినందుకు సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధి కీ సహకరస్తున్న రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు శ్రీ బట్టి ,తుమ్మల , పొంగులేటి ల కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
ఈ కార్యక్రమం లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షులు పువళ్ళ దుర్గా ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ రావి నాగేశ్వరావు,సత్తుపల్లి మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, కల్లూరు మార్కెట్ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి,జిల్లా కాంగ్రెస్ నాయకులు పసుమర్తి చందర్ రావు, లక్కినేని కృష్ణ, ఆళ్లకుంట నరసింహారావు, ఏనుగు సత్యం బాబు, యూత్ నాయకులు యాసా శ్రీకాంత్,కార్యకర్తలు, మహిళా, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.