15-05-2025 11:10:40 PM
నివాళులర్పించిన ఎమ్మెల్యే సోదరుడు భాస్కర్ రెడ్డి..
చిన్న చింతకుంట: కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు కురువ మహాలక్ష్మి అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేశారని కార్యకర్తలు గుర్తు చేసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే జిఎంఆర్ సోదరుడు భాస్కర్ రెడ్డి మహిళా నాయకురాలు మహాలక్ష్మి పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. కుటుంబానికి ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఆయన వెంట అప్పపల్లి విండో చైర్మన్ సురేందర్ రెడ్డి, నాయకులు ఎస్ వెంకటేష్, జాకీర్, జిజి పౌలు, గంజి బాలరాజ్, ప్రతాప్, పెంటన్న, సంసోన్, అశోక్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.