9 May, 2026 | 10:15 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

విద్యార్థులకు చదువుపై సూచనలు సలహాలు ఇచ్చిన జిల్లా విద్యాశాఖ అధికారి

18-06-2025 12:00 AM

చౌటుప్పల్, జూన్ 17(విజయక్రాంతి): చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లావిద్యాశాఖ అధికారి కే.సత్యనారాయణ  సందర్శించి అనంత రం పాఠశాల విద్యార్థులతో ముచ్చటిస్తూకఠోర,శ్రమ,పట్టుదల,అంకితభావంతో కృషి చేసినట్లయితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని ఉద్బోధించారు.

మహానుభావులు అయిన వివేకా నంద, అబ్దుల్ కలాం, మహాత్మా గాంధీ మొదలగు వారి జీవితచరిత్రలు అధ్యయనం చేయడం వల్ల సన్మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు.వ్యసనాలకు దూరంగా ఉండాల ని, క్రమశిక్షణ, విలువలతో కూడిన జీవితాన్ని గడపాలని సూచించారు.ఈ కార్యక్రమం లో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు నల్లెంకి శంకరయ్య ,బోధనా సిబ్బంది అయిన శ్రీమతి శ్వేత, విజయ్ ప్రతాప్, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.