9 May, 2026 | 11:04 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

ఇందిరా మహిళాశక్తి చీరలతో చేతినిండా ఉపాధి

18-06-2025 12:00 AM

-గడువులోగా మొదటి చీర అందించాలి

-బతుకమ్మ చీరల బకాయిలు రూ.280 కోట్లు చెల్లించాం

-ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

-సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమలో ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించిన విప్, చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, కలెక్టర్ 

రాజన్న సిరిసిల్ల: జూన్ -17( విజయక్రాంతి); రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో  సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తితో చేతినిండా పని క ల్పిస్తున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.  సిరిసిల్లలోని గణేష్ నగర్ లో ఉన్న మామి డాల నారాయణ, కొండ సుభాష్ కు మరమగ్గాల యూనిట్లను ప్రభుత్వ విప్, వేములవాడ  ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్,  చేనేత జౌళి, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అధికారులతో కలిసి మంగళవారం చీరల ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. ఈ  సంద ర్భంగా కార్మికులతో మాట్లాడారు.